నా భూమి నా దేశం మరియు స్వచ్ఛభారత్

Spread the love

నెహ్రూ యువ కేంద్ర మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో నా భూమి నా దేశం మరియు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముందుగా విద్యార్థుల చేత స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించి ప్రతి విద్యార్థి చేత మట్టిని సేకరించడం జరిగింది తరువాత కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి మహేంద్ర రెడ్డి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ గారు పాల్గొన్నారు మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శుభ్రత మీద అవగాహన కలిగి ఉండాలని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని నా భూమి నా దేశం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలియజేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ సహజీవనరులను కాపాడుకోవాలని నీటి పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని సహజ వనరులను వృధా చేయకుండా భావితరాలకు అందజేయాలని తెలియజేశారు. ప్రిన్సిపల్ వరప్రసాద్ మాట్లాడుతూ 2030 నాటికి భారతదేశ చెత్త లేని దేశంగా మారాలని దానికి ప్రజలందరూ తోడ్పడాలని మహాత్మా గాంధీ ఆశించిన దేశంగా నిర్మించుకోవాలని తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page