టీడీపీ నాయకుడు మునయ్య అంతక్రియల్లో పాల్గోన్న ముత్తుముల

Spread the love

దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి

రూ.2 లక్షల ఆర్ధిక సహాయం అందచేత

బాధిత కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెనాయుడు గారు

తెలుగుదేశం పార్టీ అన్నీ విధాలుగా ఉంటుందని హామీ

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, సంజీవరాయుని పేట పంచాయతీలోని పరమేశ్వర్ నగర్ లో ఈ నెల 18వ తేదీన స్థానిక వైసీపీ నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ నాయకుడు పాముల మునయ్య హైదరాబాద్ వైద్యాశాలలో మృతి చెందాడు. గత రాత్రి భౌతికకాయం వారి నివాసానికి చేరుకోగా, ఉదయం టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మునయ్య భౌతికకాయానికి టీడీపీ జెండా కప్పి, పూలమాల వేసి నివాళులు అర్పించారు.

కన్నీటి పర్యంతం అయిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజారాపు అచ్చెన్నాయుడు ఫోన్ ద్వారా పరామర్శించి తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అన్నీ విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ మునెయ్యను హత్య చేసిన వైసీపీ నాయకులను, వారి వెనుక ఉండి నడిపించిన సూత్రదారులను కఠినంగా శిక్షించాలని, ప్రశాంతంగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు తెరలేపిన వారిని నియోజకవర్గ ప్రజలు ఉపేక్షించరని, ఇలాంటి చర్యలకు పాల్పడింది ఎంతటి వారు అయిన పోలీసుశాఖా వారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షేంచే వరకు తెలుగుదేశం పోరాటం చేస్తుందన్నారు. మునయ్య సతీమణికి అశోక్ రెడ్డి రూ. 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించి, అనంతరం మునయ్య అంతక్రియల్లో పాల్గోని పాడే మోసి కార్యక్రమం చివరి వరకు ఉన్నారు..

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వండలాది మంది పాల్గోన్నారు.

Related Posts

You cannot copy content of this page