మున్సిపల్ స్టాండింగ్ కమిటి సమావేశం
సాక్షిత, తిరుపతి బ్యూరో:
తిరుపతి అభివృద్దికి స్టాండింగ్ కమిటిలో చర్చించి పలు అభివృద్ది పనులను ఆమోదించినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, స్టాండింగ్ కమిటి చైర్ పర్సన్ డాక్టర్ శిరీషా తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి సమావేశం మంగళవారం మేయర్ డాక్టర్ శిరీషా అధ్యక్షతన, కమిషనర్ అనుపమ అంజలి అజెండాను ప్రవేశపెట్టగా డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, నరసింహాచారి, గణేష్, ఉమాఅజయ్ సమక్షంలో చర్చించి ఆమోదం తెలపడం జరిగింది. గడిచిన ఆరు నెలల కాలంలో 90 శాతం 74,66,560 రూపాయాలు యూజర్ చార్జీలు వసూలు చేసిన 2,498 మంది వాలంటీర్లకు 5 శాతం ప్రోత్సహకనగదు గాను 3,71,827 రూపాయాలను ప్రోత్సహకంగ ఇచ్చేందుకు కమిటి ఆమోదించడం జరిగింది. 13వ డివిజన్ న్యూ ఇందిరానగర్లో 44 లక్షలతో పనులకు ఆమోదం, 1వ వార్డులో 22 లక్షలతో సిసి రోడ్డు, అదేవిదంగా మురికి కాలువలు, రోడ్డు నిర్మాణాలకుగాను 40 లక్షలు, వివిధ వార్డుల్లో 26 బోర్లు త్రవ్వించుటకు ఒక కోటి రూపాయాలతో పనులు చేయడం జరిగినా నిధులు విడుదల కాకపోవడంతో, నగరపాలక సంస్థ సాదారణ నిధుల నుండి 41,98,259 రూపాయాలు చెల్లించాలంక్ కమిటి ఆమోదించడం జరిగింది. సచివాలయ పరిపాలనా సౌలభ్యము కోసం ఫింగర్ ప్రీంట్ స్కానర్ల కొనుగోలుకు 16,98,465 రూపాయాలకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరెంటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, సెక్రటరీ రాధికారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, నరేంధ్రనాధ్, అమరనాధ్ రెడ్డి, రెవెన్యూ అధికారులు లోకేష్ వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ , మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ స్టాండింగ్ కమిటి సమావేశం
Related Posts
గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.
SAKSHITHA NEWS గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత…
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన
SAKSHITHA NEWS వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు…