ప్రజారోగ్యానికి భరోసా-జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం అన్ని మండలాలలోని పలు సచివాలయలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్ క్యాంపులను ప్రారంభించారు.
ఈపూరు మండలం ఇనిమెళ్ళ గ్రామం లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి ఉచితంగా వైద్యం, మందులు అందించడంతో పాటు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అన్నారు.
అలాగే అధికారులతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. మనం ప్రభుత్వం నుండి ఎన్నో సంక్షేమ పధకాల ద్వారా ఆర్థిక సాయం చేసినా కూడా ఆరోగ్యం విషయాల్లో చిన్న కుటుంబాలు మెరుగైన వైద్యం చేయించుకోలేక పోతున్నాయని, అలాంటి వారికి జగనన్న ఆరోగ్య సురక్ష చాలా మంచి కార్యక్రమని తెలిపారు. చాలా మందికి ఏ ఆరోగ్య సమస్యకు ఎవరి వద్దకు వెళ్ళాలో తెలియదు. అలాంటి వారిని గుర్తించి, వారికి అవసరమైన సహాయం ప్రభుత్వం నుంచి అందేవిధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఖచ్చితంగా మనమంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజలందరికీ కూడా మరింత ఉపయోగపడేలా ఉంటుందని, జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరి ఆరోగ్యానికి రక్షగా ఉండబోతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానని అన్నారు.