SAKSHITHA NEWS

ఎంపీ వద్దిరాజు ఫ్లైఓవర్ మంజూరు పట్ల హర్షం

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకుల కష్టాలకు ఇక చెక్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ఫ్లైఓవర్ మంజూరు

ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఫ్లైఓవర్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ రవిచంద్ర
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకుల కష్టాలు త్వరలో తీరనున్నాయి.హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిలో మూసీ నది బ్రిడ్జి టేకుమట్ల గ్రామం దాటిన తర్వాత ఖమ్మంకు కొత్త రోడ్డు నిర్మాణం జరిగిన విషయం తెలిసిందే.అయితే, ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు సూర్యాపేట వైపు రాయినిగూడ గ్రామ సమీపానికి సుమారు 2కిలోమీటర్స్ వెళ్లి యూటర్న్ తీసుకోవలసి వస్తున్నది.ఇది వాహనదారులకు ఇబ్బందిగా ,ప్రమాదకరంగా మారింది,పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి.

ఈ బ్లాక్ స్పాట్,ఇక్కడ నెలకొన్న ప్రమాదకర పరిస్థితి గురించి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గతంలో, ఇప్పుడు పలుమార్లు స్వయంగా కలిసి వినతిపత్రాలు ఇవ్వడం,లేఖలు రాయడం విధితమే.ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తులను పరిశీలించి గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ ఫ్లైఓవర్ మంజూరు చేశారు.దీని నిర్మాణపు పనులను నేషనల్ హైవేస్ అథారిటీ(NHA)త్వరలో చేపట్టనుంది.తన విజ్ఞప్తి మేరకు ప్రయాణీకుల కష్టాలను కడతేర్చేందుకు,ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ మంజూరు చేయడం పట్ల ఎంపీ వద్దిరాజు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Image 2024 08 02 at 17.05.56

SAKSHITHA NEWS