SAKSHITHA NEWS

వీధి కుక్కలను ఎనిమల్ బర్త్ సెంటర్ కు తరలింపు

*సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి పట్టణంలోని 15 వార్డులలో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది ఎనిమల్ బర్త్ సెంటర్ కు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శంకర్‌పల్లి మున్సిపల్ కు, బ్లూ క్రాస్ సొసైటీ హైదరాబాద్ వారికి మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారని తెలిపారు.

పట్టణ పరిధిలో గల వీధి కుక్కలను స్టెరిలైజేషన్ కొరకు అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లకు తరలిస్తారని ఛైర్ పర్సన్ తెలిపారు. కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు సృష్టించకుండా ఉండాలని కుక్కలను తరలించడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు వారి వారి కాలనీలలో కుక్కల బెడద ఉన్నట్లయితే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు చంద్రమౌళి, శ్రీనాథ్ గౌడ్, సంధ్యారాణి అశోక్ కుమార్, వార్డు ఆఫీసర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS