SAKSHITHA NEWS

సీఎం సహాయనిది ద్వారా ఆర్థిక సహాయం అందించిన సీపీఐ నాయకులు

అంజయ్య నగర్ నివాసి యువజన సంఘం కార్యదర్శి వెంకటేష్ అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స డబ్బులు పెట్టి చికిత్స చేసుకోగా వారికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో 90 వేల రూపాయలను సీఎం సహాయ నిధి నుండి ఇప్పించడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ ప్రజలందరు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని,పార్టీలకు అతీతంగా సీపీఐ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, సీపీఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్,రచయిత మోహన్ బైరాగి, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్ మునిసిపల్ అధ్యక్షుడు రాములు,స్థానిక నాయకులు బాబు, రాములు, సోమన్న,రవి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS