రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులతో కలిసి సమావేశమయ్యారు
సాక్షిత : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీ ఫారంలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు సభలు,సమావేశాలు, గ్రూప్ మీటింగులు,రోడ్ షోలు, ప్రెస్ మీట్స్,సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఏ విధంగా ముందుకు సాగాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం అనంతరం ఎంపీలు వద్దిరాజు,నామ, మాజీ మంత్రి పువ్వాడ,ఎమ్మెల్సీ మధులు ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్,డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, పార్టీ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ,బొమ్మెర రాంమూర్తి,రాజు గౌడ్,శీలం శెట్టి వీరభద్రం తదితరులతో సమావేశమై పార్టీ అభ్యర్థి ఘన విజయం కోసం ఏ విధంగా ప్రజలతో మమేకం కావాలనే అంశమై చర్చించారు.ఆ తర్వాత వీరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో భేటీ అయ్యారు.
ఎంపీ వద్దిరాజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో
Related Posts
కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు
SAKSHITHA NEWS కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంకర్ క్రెసర్ రద్దు చేయాలి ఇచ్చిన లేటర్ ను కలెక్టర్ కి మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ…
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు
SAKSHITHA NEWS అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత…