SAKSHITHA NEWS

ప్రధాని మోడీ బీసీ అయి కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం విచారకరం: ఎంపీ రవిచంద్ర

తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే: ఎంపీ రవిచంద్ర

కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని,మోసపోయామని ప్రజలు అంటున్నరు: ఎంపీ రవిచంద్ర

కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది,బోరు మిషన్ల హోరు పెరిగింది: ఎంపీ రవిచంద్ర

కేసీఆర్ ప్రోత్సాహంతో అజయ్ కుమార్ ఖమ్మం నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశారు: ఎంపీ రవిచంద్ర

గెలుపోటములు సహజం,కేసులకు భయపడొద్దు, సంఘటితంగా ముందుకు సాగుదాం: ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ అభ్యర్థి నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం: ఎంపీ రవిచంద్ర

ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు, మాజీ మంత్రి అజయ్ కుమార్,మేయర్ నీరజ,డీసీసీబీ మాజీ ఛైర్మన్ నాగభూషణంలతో కలిసి బీఆర్ఎస్ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు

ఖమ్మం మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రముఖులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు
ప్రధాని నరేంద్ర మోడీ బీసీ అయి కూడా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.మన తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించకుండా తీవ్ర వివక్ష చూపారని నిశితంగా విమర్శించారు. ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,నగర మేయర్ నీరజ, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంలతో పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మాజీ మంత్రి అజయ్ కుమార్ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో పార్టీ ప్రముఖులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని,మోసపోయామని ప్రజలు అంటున్నారన్నారు.కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని,ఎక్కడ చూసినా బోర్ మిషన్లు కనిపిస్తున్నాయని,బోర్ మిషన్ల హోరు పెరిగిందని, తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఎంపీ వద్దిరాజు వివరించారు.మహానేత కేసీఆర్ ప్రోత్సాహంతో ఖమ్మం ఎమ్మెల్యే గా, మంత్రిగా అజయ్ కుమార్ నగరానికి అద్భుతంగా అభివృద్ధి చేశారని వివరించారు.గెలుపోటములు సహజమని,అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో బనాయించి తప్పుడు కేసులకు ఎవరూ కూడా భయపడవద్దని, తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఎంపీ రవిచంద్ర భరోసానిచ్చారు.మనమందరం మరింత సంఘటితంగా ముందుకు సాగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని ఎంపీ వద్దిరాజు చెప్పారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు గుండాల కృష్ణ(ఆర్జేసీ),జీవన్ కుమార్,వీరూనాయక్,కమర్,బచ్చు విజయ్ కుమార్ తదితరులు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,”బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు”అంటూ గులాబీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.


SAKSHITHA NEWS