సాక్షిత విజయవాడ: విజయవాడ లోని నోవోటల్ హోటల్ లో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థతో ఏపీ ఆఫ్కాఫ్ తో జరిగిన అవగాహనా ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు .
ఈసందర్భంగా మంత్రి వ్యాపారస్తులకు పేటియం మిషన్లు అందజేసారు. అలాగే మంత్రి మాట్లాడుతూ.. చేపల రిటైల్ & అవుట్ లెట్‌లు కలిగిన లబ్దిదారులకు ఆన్ లై న్ చెలింపుల కోసం పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, ఏపీలో ఉత్పత్తి అవుతున్న 30 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులలో 15 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం స్థానికంగానే ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు
.
అలాగే ప్రస్తుతం ఏపీలో తలసరి చేపల వినియోగం 8-9 కేజీలు మాత్రమే ఉందని, దీన్ని 21 కేజీలు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనని,ఫిష్ ఆంధ్రా బ్రాండ్ తో ఏపీలో రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2, 725 మినీ రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ప్రస్తుతం 355 ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు పని చేస్తున్నాయని, 15 ఎఫ్‌పీఓ ఆక్వా హబ్ లు & పులివెందుల, విశాఖ, వినుకొండ లలో ఫిష్ ఆంధ్రా సూపర్ రిటైల్ అవుట్ లెట్లు పని చేస్తున్నాయని ఆయన అన్నారు.
అంతేకాకుండా ఆసక్తి ఉన్న యువత ఎవరైనా ఫిష్ ఆంధ్రా బ్రాండ్ అవుట్ లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చునని, ఫిష్ ఆంధ్రా మినీ అవుట్ లెట్‌ల ఏర్పాటుపై కేంద్రం అభినందించి ఈ ఏడాదికి స్కోచ్ గోల్డ్ అవార్డు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఈకార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి తోపాటు ఫిషరీస్ కమీషనర్ కన్నబాబు , ఫిషరీస్ జేడీ, పేటియం ప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.