SAKSHITHA NEWS

Motorists should exercise caution during rainy season

వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు

గద్వాల:-వాహనదారులు వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు సూచించారు. సోమవారం తన ట్రాఫిక్ కార్యాలయం నుండి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. వాహనాల కండిషన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, పరిమిత వేగంతో జాగ్రత్తగా ప్రయాణించాలని చెప్పారు. ఈ సీజన్ లో డ్రైవింగ్ చేసే ముందు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు చేసిన సూచనలు ఇవే..వాహనం టైర్ల గ్రిప్/థ్రెడ్ ను సంబంధిత నిపుణులతో చెక్ చేయించాలి.

గ్రిప్ బాగోలేకపోతే వెంటనే టైర్లను మార్చుకోవాలి.టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.వర్షంలో ప్రయాణిస్తున్నపుడు పరిమిత వేగంతో వెళ్లడం మంచిది.వాహనం ఇంజిన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి.బ్రేక్స్ పాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయించడం మేలు.వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.అత్యవసర సమయాల్లో డయల్ 100 కి కాల్ చేసేలా మొబైల్/ వాహనంలో స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వెంటనే సాయం అందే వీలుంటుంది.వర్షాకాల నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలి. మీ వాహనాల టైర్ల గ్రిప్ /థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోండి. టైర్ల గ్రిప్ బాలేకపోతే వెంటనే మార్చుకోండి. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి అని అయన అన్నారు


SAKSHITHA NEWS