సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
త్యాగానికి ప్రతిరూపమైన ఇమామ్ హస్సన్, హుస్సేన్ బలిదాన గుర్తుచేసుకుంటూ నేరేడ లో ఘనంగా పీర్ల పండగ నిర్వహించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లోని నేరేడ గ్రామం లో మొహరం పండుగ చాలా ఘనంగా నిర్వహించారు. ఇక్కడ దాదాపు వంద సంవత్సరాలు పైగా పండుగ నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా గ్రామంలో ప్రతి ఒక్కరు పాల్గొని పండుగ 10 రోజులపాటు నిష్టగా నిర్వహించారు. ఇక్కడ అన్ని కులాల వారు కలిసి భయభక్తులతో పండుగ జరుపుకుంటారు. ఈ ఊరిలో ముఖ్యంగా మొహర్రం చంద్రోదయం కనబడిన రోజు నుండి ఆషురా రోజు వరకు మద్యము, మత్తు పానీయాలు మరియు మాంసాహారం ముట్టరు. ఈ సాంప్రదాయ గ్రామంలో అన్ని కులాల వారు పాటిస్తారు. శనివారం పండుగ చివరి రోజు కావడము వలన పీర్ల ను గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు.
ప్రతి ఒక్కరూ ఇమామ్ హస్సన్, హుస్సేన్ ఆశీర్వాదం తీసుకొని బెల్లంతో తయారు చేసిన పానకము నీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆలస్యం నరసింహారావు (పటేల్), ఆలస్యం మధు, ప్రసాద్, పెద్ద నరసింహారావు, మాజీ సర్పంచ్ జిల్లా రైతు బంధు నాయకులు మంకెన రమేష్, మాజీ సర్పంచ్ కిలారు సూర్య ప్రకాష్ రావు, కిలారు భూషయ్య,ఆలస్యం నాగేశ్వరావు, శివ కృష్ణ, వంకాయలపాటి పెద్ద వెంకయ్య, పులిపాటి వెంకయ్య రిటైర్డ్ (ఎస్ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్), ముస్లిం గ్రామ పెద్దలు సౌందు సాహెబ్, షేక్ అఫ్టల్, పెద్ద ముజవర్ మదర్ సాహెబ్, షేక్ మీరా (పంగిడి బుజ్జ),ఎంపీటీసీ కొల్లి యామిని, సర్పంచ్ గొర్రెముచు ఈశ్వరమ్మ, ఉప సర్పంచ్ దూసరి గోపాల్ రావు, గ్రామ పెద్దలు నున్న తాజుద్దీన్, నన్నక కోటయ్య, వంకాయలపాటి సత్యం, ఆలస్యం రాములు, దూసరి నేతాజీ, వంకాయలపాటి మాధవరావు, ఆలస్యం నరసయ్య, బాబు, మేడా అప్పారావు, షేక్ జాని మీయ (రామాపురం)
పులిపాటి బాబు, వడ్డేపుడి ముత్తయ్య, చెవుల ఖాదర్ బాబు,వడ్డేపుడి క్రిష్ణ. వడ్డేపుడి బాబు, రాగం లింగబాబు, చెవుల ప్రసాద్, చెవుల తిరపయ్య, దోమకొండ వెంకన్న, కోట బుచ్చాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.