SAKSHITHA NEWS

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ ఆటో స్టాండ్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ రజక సంఘం అధ్యక్షులు టిఆర్ఎస్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్ గారు, ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన దీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, జాహిద్ షరీఫ్ బాబా, సుంకన్న, కృష్ణ, శేఖర్, రాము యాదవ్, మల్లికార్జున్, యోగి రాజు, తదితరులు పాల్గొన్నారు.