SAKSHITHA NEWS

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే రామసముద్రంలో ఓటేసినట్టే – ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు


సాక్షిత : మల్లన్న సాగర్ ప్రాజెక్టులో
భూములు కోల్పోయిన ఓ రైతు తన ఇంటి తానే కూల్చుకొని చితి పెల్చుకొని సజీవ దాహం అయితే చెల్లించని అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఎంపీగా గెలుపొంది దుబ్బాక
నియోజకవర్గాని అభివృద్ధి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బిజెపి మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్యకర్తలతో కలిసి దుబ్బాకలో ఇంటింటా తిరుగుతూ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ వెంకట్రాంరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు అని అన్నారు అంతేకాకుండా గజ్వేల్ సిద్దిపేట అభివృద్ధి చెందుతే కనీసం దుబ్బాక వైపు కూడా చూడలేదన్నారు కానీ ఇప్పుడు దుబ్బాకను అభివృద్ధి చేస్తాననడం దారుణమని అన్నారు.కలెక్టర్ గా ఉండి అభివృద్ధి పనులు చేశాను చేశానని చెప్పుకుంటున్నారు


కానీ 30 మంది కలెక్టర్లు వేనుక వెంకట్రాంరెడ్డి కలెక్టర్ అని అన్నారు.కస్తూర్బా పాఠశాలకు కాంపౌండ్ వాలు ఇవ్వమని పదిసార్లు అడిగినా వెంకటరామిరెడ్డి చెలిoచలేదని అన్నారు ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తికి ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదుకానీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొడుతూ ప్రోసిడింగ్లు ఇస్తా ఉంటే బి ఆర్ ఎస్ నాయకుల కళ్ళు మూసుకుపోయాయాఅని ప్రశ్నిస్తున్నానని అన్నారు
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకున్న బి ఆర్ ఎస్ నేతలు నాయకులంతా ఎటు వెళ్లిపోయారని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ దుబ్బాక మండల అధ్యక్షులు అంబటి శివ ప్రసాద్ గౌడ్, పట్టణ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు బాలేష్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ ఎస్ ఎన్ చారి,కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు తిరుమల రెడ్డి,సుంకోజ్ ప్రవీణ్, తొగుట రవి,నియోజకవర్గం స్థాయి మండల అధ్యక్షులు,మాజీ సర్పంచులు చందాపూర్ మాజీ బొడ్డు నర్సింలు,సర్పంచ్ ,ప్రజాప్రతినిధులు బీజేపీ శ్రేణులు,కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 22 at 6.20.53 PM

SAKSHITHA NEWS