SAKSHITHA NEWS

ఆధునిక పరిజ్ఞానం అవసరం…
-డిగ్రీ కాలేజ్ లో అంతర్జాతీయ సదస్సు…


సాక్షిత మండపేట, :
ఆధునిక పరిజ్ఞానం ఎంతో అవసరమని ఎమ్మెల్యే
వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట ప్రభుత్వ కాలేజ్ లో స్మార్ట్ మెటీరియల్స్ అడ్వాన్స్‌డ్ అప్లికేషన్ అనే అంశం పై అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె.వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. విశిష్ట అతిధులు జ్యోతి ప్రజ్వలన చేశారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ప్రొఫెసర్ కె.నవీన్ కూమార్, డాక్టర్ ఎ.బార్గవ్ లు మాట్లాడుతూ ఆధునిక కాలం లో స్మార్ట్ మెటిరియల్ అవశ్యకత ను వివరించారు. తిరుచునాపల్లి ఎన్ ఐ టి నుండి విచ్చేసిన ప్రొఫెసర్ హేమలత నానో మెటీరియల్స్ – పాలిమార్ అంశం వివరించారు. స్మార్ట్ మెటీరియల్ అనే అంశం పై న్యూఢిల్లీ నుండి వచ్చిన డాక్టర్ బిపిన్ కూమార్, తిరుపతికి చెందిన డాక్టర్ పి.విష్ణు ప్రశాంత్ లు వివరణాత్మకంగా సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేశవిదేశాల నుండి పరిశోధన వ్యాసాలు సుమారుగా వందకు పైగా వచ్చినట్లు కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కాలేజ్ అధ్యాపకుల విద్యార్థులు వివిధ కాలేజ్ లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 23 at 17.06.07

SAKSHITHA NEWS