SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కు చెందిన హపురామ్ వెన్ను సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో సహకరించాలని మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని అశ్రాయించారు. స్పందించిన ఎమ్మెల్సీ హపురామ్ వెన్ను పూస చికిత్స కోసం రూ. 2. 5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధిని మంజూరు చేయించి ఎల్ఓసీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్, నేతలు ప్రభాకర్ గుప్త, జీతయ్య ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, ప్రవీణ్ నాయక్, యాదగిరి, కాలు రామ్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS