SAKSHITHA NEWS

సాక్షిత హైదరాబాద్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్‌ డే రోజున ఆడ‌ బిడ్డల ఉద్యోగాల‌కై ధ‌ర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసు కొచ్చిందని విమర్శించారు.

బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మహిళలకు అనేక హక్కు లు కల్పించారని చెప్పారు. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఇవాళ హైదరాబాద్‌ ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేప‌ట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడు తూ.. తెలంగాణ వచ్చిన తర్వాత 33శాతం రిజర్వే షన్‌ను పెంచుకున్నామ న్నారు. కేసీఆర్‌ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు లక్షకు పైగా ఉద్యోగాలు మ‌హిళ‌ ల‌కు ఇచ్చామ‌ని చెప్పారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో మాట తప్పిం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యక్తిగతంగా చని పోయిన ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రేవంత్‌ రెడ్డి రాజకీయం చేశార‌ని విమర్శించారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి మహిళల ఉద్యోగాల విషయంలో కోత విధించారన్నారు. వికలాంగు లు, మహిళలకు తోడు ఉండకుండా ఎవరికి తోడు ఉంటున్నారో చెప్పాలని రేవంత్ ను నిల‌దీశారు. క‌విత‌.

మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS