ఐటి హబ్ భవన పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత

Spread the love

ఐటి హబ్ భవన పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత
సాక్షితనిజామాబాద్ : ఐటి హబ్ భవన పనులను పరిశీలించిన *ఎమ్మెల్సీ కవిత, ఐటి హబ్ కు సంబందించిన వెబ్ సైట్ గురించి ఎమ్మెల్సీ కి వివరించిన బి అర్ ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేష్ గుప్తా.. IT hub Nizamabad వెబ్ సైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ .. ఇందులో పరిశ్రమల అభివృద్ధి కి ఐటి హబ్ ఒక ఆరంభం లాంటిది.. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయి. నిజామాబాద్ యువతకు శుభ వార్త ..త్వరలో ఐటి హబ్ ప్రారంభిస్తాం.

నిజామాబాద్ లో ఐటి హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ద తీసుకున్న సీఎం కేసీఆర్ కేటీఆర్ కు ధన్యవాదాలు.. యువత కు ఉపాధి కల్పన లక్ష్యం గా చేపట్టిన ఐటి హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయి.. అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంబం చేయిస్తాం.. ఇతర జిల్లాల ఐటి హబ్ లతో పోల్చుకుని లోటుపాట్లను సరిదిద్ది నిజామాబాద్ ఐటి హబ్ ను ఏర్పాటు చేసుకున్నాం.. 50 కోట్ల వ్యయం తో చేపట్టిన ఐటి హబ్ లో 750 మంది యువతకు అవకాశం.. ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయి దేశ వ్యాప్తంగా ఐటి ఎక్స్పోర్ట్ లో రెండవ స్థానం లో ఉన్నాం.. మూడు నుండి నాలుగు వేల మంది ఇతర ప్రాంత వాసులకు అవకాశం.. త్వరలో మరింత విస్తరిస్తం తెలంగాణ లో కలలు కన్న ప్రగతి సాధ్యమౌతుంది..

భవిషత్ ప్రణాళిక తో నిర్మాణాలు చేయించిన ఎమ్మేల్యే గణేష్ ,ఎన్నారై కొడినేటర్ మహేష్ బిగాలకు అభినందనలు. డిగ్రీ కళాశాల లతో ఒప్పందాలు పెట్టుకుంటాం.. మరింత అభివృద్ది సాధించేందుకు ముందుకెలత. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాము..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page