ప్రశ్నించే గొంతుక.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి. తన ఛానల్ ద్వారా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తప్పు చేసేవారు తన వారైనా ప్రత్యక్ష ఆధారాలతో నిలదీసి ప్రశ్నించే జర్నలిస్ట్ మన తీన్మార్ మల్లన్న ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని తమ తోటి పట్టభద్రులను తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని అశ్వరావుపేట పట్టణ ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్ అభ్యర్థన చేశారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం నల్గొండ వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించబడడం చాలా సంతోషకరమని ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులు ప్రజా గొంతుక అయినటువంటి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మనవి చేశారు పట్టభద్రులారా ప్రజాస్వామ్యం బ్రతకాలంటే రాజ్యాంగం అమలులో ఉండాలంటే ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు అభ్యర్థించారు.
ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిపించండివేముల భారతీ ప్రతాప్..
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…