మేడారం గ్రామములో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క
జంపన్న వాగు ఉదృతంగా ప్రవహించడం తో నీట మునిగిన మేడారం గ్రామం
బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి
ముంపుకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి దైర్యం గా ఉండాలని సూచించిన సీతక్క
భారీ వర్షాల మూలాన సర్వం కోల్పోయిన గ్రామస్థులు వ్యాపారస్తులు
జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య ఐఎఎస్ గారిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్ గారిని ఫోన్ ద్వారా పారిశుధ్య పనులు చేపట్టి బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలి అని కోరిన ములుగు ఎమ్మెల్యే సీతక్కగారు
ఈ రోజు తాడ్వాయి మండలం లోని మేడారం గ్రామములో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ములుగు నియోజక వర్గం లో ప్రణ నష్టం తో పాటు అస్తి నష్టం వాటిల్లింది అనేక గ్రామాలు వరుదల్లో చిక్కుకొని తినడానికి తిండి లేక తాగటానికి మంచినీళ్ళు లేక అలమటిస్తున్న పరిస్థితి ఉందని వరుద ల వదృతి వలన ఇంట్లో ఉన్న వస్తువులు, కార్లు,ట్రాక్టర్లు వంట సామాగ్రి,వ్యాపారస్తుల దుకాణాలు వరుదల్లో కొట్టుకుపోయి సర్వసం కోల్పోయారు కొండాయి, బురగు పేట లాంటి గ్రామాల్లో ప్రాణ నష్టం వాటిల్లింది రాష్ట్ర ప్రభుత్వం ముంపుకు గురైన బాధిత కుటుంబాలను ఆదుకోవాలి వారికి నష్ట పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అదే విధంగా వరుదల్లో
కొట్టుకుపోయి మరణించిన కుటుంబాలకు ఒక్కరికీ 5 లక్షల చొప్పున నష్ట పరిహారం తో పాటు వారికి డబుల్ బెడ్ మంజూరు చేయాలని సీతక్క గారు అన్నారు
జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య ఐఎఎస్,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్ గారికి ఫోన్ చేసి ముంపుకు గురైన గ్రామములలో పారిశుధ్య పనులు చేపట్టి బాధిత కుటుంబాలకు బోజన సౌకర్యం కల్పించాలని పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేయాలని గ్రామాల్లో అధికారులు పర్యటించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
మండల ఇంఛార్జి జాలపూ అనంత రెడ్డి, మండల అధ్యక్షులు బోళ్లు దేవేందర్
పిరిల వెంకన్న,సర్పంచ్ ఇర్ప సునీల్,జిల్లా నాయకులు అర్రెమ్ లచ్చు పటేల్
మహిళా కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలు పొలబోయిన సృజన,బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి,తో పాటు తదితరులు ఉన్నారు