వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతన్నల పక్షపాతి అని మరోసారి నిరూపించిందని ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధ్వర్యంలో రబీ సీజన్లో రైతన్నలకు 40శాతం సబ్సిడీ పై శనగ విత్తనాలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ… రైతుల పక్షాన నిలిచి రైతన్నలకు మంచి చేసే ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్నారు. రబీ సీజన్లో పంటల సాగు చేసేందుకు 40శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు అందిస్తున్నామన్నారు. గత ఏడాది 25శాతం సబ్సిడీ నుండి ఈ ఏడాది 15శాతం సబ్సిడీ పెంచుతో నేడు 40శాతం అందిస్తున్నామన్నారు. అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి రైతులకు భరోసా కల్పిస్తూ అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తాము అమలు చేస్తున్న పతకాలు టీడీపీ వారు పథకాలు కాపీ కొట్టారని చెప్పారు. అలాగే ఏపీలో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం సంతోషముగా వుందన్నారు.
వైఎ్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాయన్నారు. మిర్చీ రైతులకు భరోసా కల్పిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి మిర్చీ యార్డును నంద్యాలలో ఏర్పాటు చేశారని, నేడు విజయవంతంగా ముందుకు పోతుందని రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. మిర్చీ రైతులు గుంటూరుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రైతుల కోసం మరో ముందడుగు వేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి మిల్లెట్స్ సెకండరీ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు.
నంద్యాల మండలం రాయ మాల్పురంలో మిల్లెట్స్ సెకండరీ ప్లాంట్ ఏర్పాటుకు తాజాగా భూమి పూజ చేశామని తెలిపారు. ప్రజలు చిరు దాన్యాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే లభించే ఉపయోగాలు తెలుసుకోవాలని కోరారు. హార్టికల్చర్ రైతన్నలకు వ్యవసాయ ఉత్పత్తులను నిలువ చేసుకునేందుకు తొమ్మిది గోడౌన్లను నిర్మించేందుకు పనులను చేపట్టామని, వాటిని త్వరలో పూర్తి చేసి రైతన్నలకు అంకితం చేస్తామన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతులకు మరింత మేలు చేసే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పోలూరు మహేశ్వర్ రెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైసిపి గ్రామ సర్పంచులు, వైసిపి నాయకులు ,వ్యవసాయ శాఖ అధికారులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.