పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది – ఎమ్మెల్యే ఆర్కే
ఘనంగా దుగ్గిరాల మండలంలో మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కు పంపిణి కార్యక్రమం.
మూడవ విడత ఆసరాలో భాగంగా దుగ్గిరాల మండలంలో 1305 స్వయం సహాయక సంఘాల మహిళల కాతాలలో సుమారు 15 కోట్ల రూపాయలు జమ.
దుగ్గిరాల మార్కెట్ యార్డ్ కు భారీగా తరలివచ్చిన మహిళలు – కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు , ఎమ్మెల్యే ఆర్కే , అప్కో చైర్మన్ చిరంజీవి.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ : రాష్ట్రంలో గత ప్రభుత్వాలు డ్వాక్రా రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చి రుణమాఫీ చేయలేదన్నారు.
గత బకాయిలను సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లించి నవరత్నాల పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.
ఈ మూడు సంవత్సరాల కాలంలో సుమారు 40 కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ ఆసరా కొసం కేటాయించడం జరిగిందన్నారు
కుటుంబం నడపగల ఆలోచన శక్తి కేవలం మహిళలకు మాత్రమే ఉంటుందని గ్రహించిన జగన్ , కుల మత,వర్గ, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా ప్రతి మహిళకు చేయూతనందించారని అన్నారు.
ఎవరికి ఒక్క పైసా లంచం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారని అన్నారు.
రాజశేఖర్ రెడ్డి మరికొద్ది సంవత్సరాలు బ్రతికుంటే రాష్ట్రంలో పేదల స్థితిగతులు పూర్తిగా మారేవని, తండ్రి ఆశయాలకు అనుగునంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు.
రాజ్యాధికారం కోసం పనిచేసే నాయకులకు కాకుండా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులను ఆదరించాలని కోరారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ముఖ్యమంత్రి నవరత్నాల పథకాలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థితిమంతులు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో DRDA PD యుగంధర్ , జడ్పిటిసి సభ్యులు మేకతోటి అరుణ, ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, ఎంపీడీవో కుసుమ శ్రీదేవి, ఎమ్మార్వో మల్లేశ్వరి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.