నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే నోముల భగత్
హాలియ సాక్షిత ప్రతినిధి
నాగార్జునసాగర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు నుంచి ఆంజనేయ తండా వరకు 2.14 కోట్లతో నిర్మించ బోయే సీసీ రోడ్డు మరియు బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి సీఎంకేసీఆర్ ప్రత్యేకంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని సిసి రోడ్లతో పాటు బీటీ రోడ్లను కూడా అభివృద్ధి చేస్తే గ్రామాల మధ్య ప్రజలకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలవకుండా ప్రయాణం చేసే విధంగా కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని గతంలో ఏళ్ల తరబడి పాలించినటువంటి నాయకులు రోడ్లు అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టలేదని, సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నందుకు నియోజకవర్గ ప్రజల పక్షాన కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, మార్కెట్ చైర్మన్ జవాజి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు,
పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, కౌన్సిలర్లు అన్నేపాక శ్రీను, నల్లబోతు వెంకటయ్య,మార్కెట్ డైరెక్టర్ సురభి రాంబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి దోరెపల్లి వెంకన్న, కో ఆప్షన్ నెంబర్లు చాపల సైదులు, రావుల లింగయ్య, షేక్ అన్వర్, పేరూరు సర్పంచ్ సుధారాణి నాగరాజు, పేరూరు దేవస్థానం చైర్మన్ రామలింగయ్య,వార్డు అధ్యక్షులు రావులపాటి ఎల్లయ్య,రెడ్డిపల్లి జానకి రాములు, రావిల్ల చెన్నయ్య, బందిలి సైదులు,మహిళా అధ్యక్షురాలు గడ్డం రమణ, మైనార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి షకీల్,కొండేటి అశోక్,షేక్ హుస్సేన్, బండి బాను ప్రకాష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.