SAKSHITHA NEWS

పల్లెల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే నోముల భగత్

నాగార్జునసాగర్ సాక్షిత

త్రిపురారo మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా “తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పల్లెలు దేశానికి పట్టుకొమ్మలనే విధంగా ప్రతి గ్రామాన్ని అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేసి ఒక పక్క పల్లె ప్రకృతి వనం మరో ప్రక్క మరణించిన వ్యక్తి కి గౌరవంగా దహన సంస్కారాలు చేసే విధంగా వైకుంఠధామాలు నిర్మించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినప్పటికీ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యాలను తిప్పి కొట్టాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం గ్రామపంచాయతీలో ఉత్తమ సేవలందించిన పలువురిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ధూళిపాల రామచంద్రయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, ప్రధాన కార్యదర్శి పామోజు వెంకటాచారి, త్రిపురారం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పామోజు వెంకటాచారి, గ్రామ పార్టీ అధ్యక్షుడు జంగిలి శీను, మహిళా అధ్యక్షురాలు మాధ ధనలక్ష్మి, ఎంపిడిఓ మంగమ్మ వార్డు నెంబర్ కొల్లి రాము, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఇస్లావత్ చందు నాయక్, బిఆర్ ఎస్ నాయకులు బైరం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS