అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటా
వడ్డేపల్లి సుభాష్ రెడ్డి బిజెపి నాయకుడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమం పై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి గ్యారెంటీ లేదని జహీరాబాద్ పార్లమెంట్ పోటీలో ఉన్న నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎద్దేవా చేశారు
శుక్రవారం నాడు ఎల్లారెడ్డి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 6 గ్యారెంటీ పథకాలను అమలు కోసం ప్రజాపాల కార్యక్రమం చేపడుతుంటే అందులో పాల్గొనే అధికారులను అప్రమత్తం చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే మదన్మోహన్.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఆయన విదేశాలకు పోవడం వెనుక అంతర్యం అర్థం కావడం లేదన్నారు రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటుంటే ఆయనకు ఈ కార్యక్రమంపై గ్యారెంటీ లేక విదేశాలలో జల్సాలు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు అయితే ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో నూతన రేషన్ కార్డు లేనివారికి కాలాన్ని ఉంచలేదన్నారు మరియు రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు కూడా సహాయం అందిస్తామన్నారు కానీ కౌలు రైతులుగా రైతులను ఎవరు ద్రువీకరిస్తారు అని ప్రశ్నించారు అంతేకాక వివిధ ఆరు పథకాలకు సంబంధించిన సహాయాన్ని అందించడానికి బ్యాంకు అకౌంట్ నంబర్ ఎక్కడ కూడా అడగడం లేదు అన్నారు ఈ పథకం కేవలం కాలయాపన జరగడానికి చేసే విధంగా ఉందన్నారు 6 గ్యారంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని 100 రోజులగా అమలు చేయకపోతే బిజెపి పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు
అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటా
బిజెపి అధిష్టానం అవకాశం కల్పిస్తే జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా తప్పకుండా బరిలో ఉంటారని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు అన్నారు దేశంలో బిజెపి పార్టీ తో పాటు నరేంద్ర మోడీ పాలనపై ప్రజలకూ నమ్మకం పెరిగిందన్నారు అంతే కాకుండా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని త్వరలోనే అన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో కలిసి పర్యటిస్తారు అన్నారు అందరి సహకారంతో తప్పకుండా గెలిచి వస్తానన్నారు..
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి మాజీ సర్పంచ్ దేవేందర్ వైస్ ఎంపీపీ నర్సింలు సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నాయకులు జనార్దన్ రెడ్డి, పరంధాములు, కాశిరామ్, జైపాల్ రెడ్డి, చిరంజీవిలు, సాయి రెడ్డి, సంఘం రాజు, జశ్వంత్ గౌడ్ ,భాస్కర్, సోషల్ మీడియా నీల రవి తదితరులు పాల్గొన్నారు