SAKSHITHA NEWS

కొడంగల్ లో ఓడి మల్కాజిగిరిలో గెలిచిన రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు…. హుజురాబాద్ లో ఓడిన ఈటెల మల్కాజిగిరిలో గెలిచినా చేసేది ఏమీ లేదు…మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం…

బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తో పరిచయ కార్యక్రమంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కేపి. వివేకానంద ….

బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పరిచయ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు…

కుత్బుల్లాపూర్ గండి మైసమ్మలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి. వివేకానంద పాల్గొని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై బిఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాలలో నెంబర్ వన్ స్థాయిలో ఉందంటే దానికి కారణం పాలనపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఉన్న పాలనా దక్షత, అనుభవం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై, వారి అభ్యున్నతికై పాటుపడాలనే ఉత్సాహం, దూరదృష్టి మాత్రమే గత పదెళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో నిలిపి బంగారు తెలంగాణగా మారుస్తే, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ గద్దనెక్కిన కాంగ్రెస్ పాలకులు అభివృద్ధిని గాలికి వదిలేసి వారి కుర్చీలు కాపాడుకోవడానికి ఐదేళ్ల కాలం పడుతుందే తప్పా అభివృద్ధి చేసేది ఏమీ ఉండదన్నారు. దేశ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి పార్టీల చరిత్రలను ఒకసారి గమనిస్తే ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకుడు ఒక్కడులేని పార్టీ కాంగ్రెస్ అయితే, పదేళ్లలో పది ప్రభుత్వాలను కూల్చిన ఘనత బిజెపి పార్టీదేనన్నారు. ఇలా ఎప్పుడూ తమ స్వార్థం కోసం పనిచేసే పార్టీలు జాతీయ పార్టీలైతే, ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీయేనన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు కాస్త కన్ఫ్యూజ్ అయి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన, రికార్డు స్థాయి గెలుపు మాత్రం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేరిట బిఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. స్థానిక నాయకుల పై ఉన్న కాస్త అసంతృప్తితోనే కొన్ని స్థానాలను కోల్పోయినా కెసిఆర్ పై ప్రజలకు ఎటువంటి కోపం లేదన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నాయకుల, కార్యకర్తల సమన్వయం, ఎమ్మెల్యే వివేకానంద మా ఇంటి బిడ్డ అని పనిచేయడంతో 85,576 ఓట్ల భారీ మెజార్టీని సాధించి రాష్ట్రం మొత్తం నేడు కుత్బుల్లాపూర్ వైపు చూసేలా చేశారన్నారు. మన గెలుపుని రెండు జాతీయ పార్టీల నాయకులు జీర్ణించుకోలేక కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, కార్యకర్తలవరూ భయపడవద్దని మీకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఇక ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గురించి వస్తే గత 20 ఏళ్ల కాలంలో బస్తీలు, కాలనీల్లో మధుర ట్రస్ట్ పేరుతో ఉచిత వైద్య శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని ప్రజలకు సేవ చేసే నాయకుడే ప్రజలకు కావాలని, ఎన్నికలప్పుడు హెలికాప్టర్లలో వచ్చి హాయ్… బాయ్ చెప్పే నాయకులు అవసరం లేదన్నారు. స్థానికంగా మన నాయకుడు మనకు ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. కొడంగల్ లో ఓడి మల్కాజిగిరిలో గెలిచిన రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు…. హుజురాబాద్ లో ఓడిన ఈటెల మల్కాజిగిరిలో గెలిచినా చేసేది ఏమీ లేదన్నారు. బిఆర్ఎస్ పార్టీయే మల్కాజిగిరి ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ జెండాను రెపరెపలాడించాలన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 21 at 1.01.19 PM

SAKSHITHA NEWS