తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి జెండా ఆవిష్కరణలో పాల్గొని, ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. దుండిగల్ లో జ్యోతి ప్రజ్వలన చేసి మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ప్రగతి నివేదికను ఎమ్మెల్యే స్థానిక చైర్మన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా “సఫాయి అన్న.. సలాం” “సఫాయి అమ్మ.. సలాం” అంటూ వారిని ఘనంగా సన్మానించి మోమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు శ్రీహరి, సత్యనారాయణ, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొంపల్లి, దుండిగల్ లో ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ‘ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…