SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ‘తెలంగాణ హరితోత్సవం‘ వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన (మాస్ ప్లాంటేషన్) 2 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత తో కలిసి మొక్కలు నాటారు. ఈ మాస్ ప్లాంటేషన్ లో వివిధ పాఠశాలల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను మించిన సంపద మరొకటి లేదన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్తున్న దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి హరితహారం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యాచరణ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో డిసీలు ప్రశాంతి, మంగతాయారు, హార్టికల్చర్ డిడి పద్మనాభ, సర్కిల్ మేనేజర్ విజయ రాణి, శానిటేశన్ డిఈఈ ప్రశాంతి మరియు ఫారెస్ట్ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వాకర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS