సాక్షిత : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి నగర్, భగత్ సింగ్ నగర్ లలో కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జీడిమెట్ల గ్రామం, శివాలయ నగర్ అంబేద్కర్ భవన్, సూరారం రాజీవ్ గృహకల్ప, రాజీవ్ గాంధీనగర్, కుత్బుల్లాపూర్ చౌరస్తాలలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కీర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…