10.5 కోట్ల వ్యయంతో కొంపల్లి అపర్ణ ఫాంగ్రూవ్ కాలనీలో 20 లక్షల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్….
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలో పరిదిలోని అపర్ణ ఫాంగ్రూవ్ కాలనీలో 20 లక్షల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ ను ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముక్యతిదిగా చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ వైస్ చైర్మన్ గంగయ్య నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తకుండా జలమండలి అధికారులు చేపట్టిన రిజర్వాయర్ 20 లక్షల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించుకునం. పెరిగిన జనాభా అవసరాలను దృష్టిలో దీనిని నిర్మించారురూ.10.5 కోట్లతో రిజర్వాయతో పాటు 45 కిలోమీటర్ల మేర గోదావరి పైపు లైన్లు, నీటి సరఫరాకు అంతర్గత పైపులైన్లు వేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు HMWSSB జనరల్ మేనేజర్ అశోక్ కుమార్, డీజీఎం డి వీ త్రినాథ్ రావు, మేనేజర్ రవీందర్, బూర్గుబావి హనుమంత్ రావు, బూర్గుబావి సత్యనారాయణ, మాజీ ఎం పీపీ కవిత, కౌన్సిలర్లు రవి యాదవ్, సువర్ణ, రాజీ రెడ్డి, శకుంతల, డప్పు కిరణ్, మంజుల కుమార్ గౌడ్, వసంత లక్ష్మణ్, దేవేందర్ యాదవ్, కో ఆప్ సభ్యులు జి వెంకటేష్, డైరెక్టర్ మధుసూదన్ యాదవ్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ సంగీత రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బాలరాజ్, సీనియర్ నాయకులు శారదా, రమణ గౌడ్, నరహరి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.