SAKSHITHA NEWS

మంత్రి శ్రీ కేటీఆర్ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
పార్క్ అభివృద్ధి, డ్రైనేజీ సమస్యపై కాలనీ వాసులు ట్వీట్ చేయగా స్పందించిన మంత్రి కేటీఆర్…
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అరగంటలో చేరుకొని కమిషనర్ తో సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే…
తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం…
అరగంటలో స్పందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు భౌరంపేట్ సింహపురి కాలనీలో వివేకానంద పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని కాలనీ వాసులు మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ స్పందించి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అరగంటలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక కమిషనర్ కల్వకుంట్ల సత్యనారాయణ , ప్రజా ప్రతినిధులు, కాలనీ వాసులతో పర్యటించి సమస్యను పరిశీలించారు. 100 ఎకరాల వెంచర్ కావడం, సరైన డ్రైనేజీ ఔట్ లెట్ లేకపోవడంతో మురుగునీరు కొంత పార్క్ లో, పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలంలో నిలవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు సమస్యను ఎమ్మెల్యే కి వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే తక్షణమే స్థానిక కమిషనర్ కు ఆదేశాలిచ్చారు. మురుగు నీటిని ట్యాంకర్ల ద్వారా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పార్క్ పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలం యజమానితో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ సహకారంతో అవసరమైన నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. అతి త్వరలోనే వివేకానంద పార్క్ లో లైట్లు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలనీ వాసులకు మాటిచ్చారు.


అరగంటలో స్పందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు…
మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన అరగంట వ్యవధిలోనే ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తమ కాలనీకి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించి, సమస్యను పూర్తిగా తెలుసుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం పట్ల కాలనీ వాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. అరగంటలో స్పందించిన ప్రభుత్వ పని తీరు పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ మాధవి, సీనియర్ నాయకులు మురళి యాదవ్, కొలన్ శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కాలనీ వాసులు దేవేందర్ రెడ్డి, దశరథ్, సందీప్ రావు, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, మని వర్ధన్, వినోద్, అనిల్, కిషోర్, అరవింద్, రోహిత్, శ్యామ్, బాలిరెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS