మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో భాగంగా ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను పలకరించారు. కూలీలతో సరదాగా మాట్లాడారు. ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి…? డబ్బులు సమయానికి వస్తున్నాయా వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. దింతో ఉపాధి హామీ కూలీలు స్వయంగా ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చి మాట్లాడటంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.