ఆపదలో ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో నివాసం ఉండే చిత్తరి యాదగిరి యాక్సిడెంట్ జరిగి తలకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇట్టి విషయాన్ని అన్నారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి తెలియజేయడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తన కుమారుడు విక్రం రెడ్డి ద్వారా చిత్తారి యాదగిరి కుటుంబానికి హాస్పిటల్ కి వెళ్లి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎల్లప్పుడూ నాసహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలియజేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో అన్నారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు దర్గా శీను మరియు భార్య దుర్గమ్మ పాల్గొన్నారు.