మొన్నటి వరదలకు కంచల గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డుకు గండి పడి తెగిపోయిన రోడ్డు ..
త్వరితగతిన రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
నందిగామ మండలంలోని కంచల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మొన్నటి భారీ వర్షాలకు, వరదలకు నీటి ఉధృతి పెరగడంతో గండి పడి రోడ్డు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలగడంతో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కంచల రహదారిని పరిశీలించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి వర్షాలకు, వరదలకు నందిగామ మండలంలో వ్యవసాయ పంటలకు, గ్రామాలకు వెళ్లే రహదారులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. అనుకోని విధంగా వరద నీటి ప్రవాహ ఉధృతి పెరగడంతో కంచల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గండిపడి కొట్టుకుపోవడం జరిగిందని, దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న విషయం తెలియగానే ఆర్ అండ్ బి అధికారులకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్ అండ్ బి అధికారులు కంచల రహదారిని పరిశీలించి, గండిపడి కొట్టుకుపోయిన తూముల ఏర్పాటు, రోడ్డు ఏర్పాటుకు సుమారు రూ.27 లక్షలు అవుతుందని అంచనాలు రూపొందించారని, ఫ్లడ్ డామేజ్ రోడ్స్ (FDR) ఫండ్స్ నుండి త్వరితగతిన నిధులు మంజూరు చేయించి, రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..