నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే చిరుమర్తి

Spread the love

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ ని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, స్థానిక కౌన్సిలర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ కమ్యూనిటీ హాల్ ని మంజూరు చేశామని తెలిపారు. 4 సం.ల కాలంలో డ్రైనేజీ సమస్య ఉంటే దాన్ని పూర్తి చేశామని, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇప్పటివరకు 22 కోట్ల రూపాయలని ఇప్పటివరకు మంజూరు చేశామని అన్నారు. గత పాలకులకు అభివృద్ధిపై సోయి లేక పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి మున్సిపాలిటీ ప్రతి గ్రామం అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

రైతు వేదికలు, వైకుంటదామాలు సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. ఏండ్ల క్రితం మొదలుపెట్టిన ఉదయసముద్రం ప్రాజెక్ట్ ను ప్రారంభించారు కానీ పనులు పూర్తి కాలేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ముఖ్యమంత్రి తో పలుమార్లు ప్రాజెక్ట్ గురించి చెప్పానని ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేసి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆదేశించారని అన్నారు. త్వరలోనే ప్రాజెక్టుని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేయిస్తానని అన్నారు. కల్యాణలక్ష్మి , రైతుబందు, రైతు భీమా,దలితబందు, షాదీ ముబారక్, మన ఊరు మన బడి, ఇలా ఎన్నో పథకాలతో అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జడల అధిమల్లయ్య, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, జిట్ట పద్మ బొందయ్య, కో ఆప్షన్ సభ్యులు జమిరుద్దిన్, సింగల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, గంట్ల శ్రీనివాస్ రెడ్డి,
గ్రంధాలయ చైర్మన్ దాసరి నరసింహ, యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చిత్రగంటి ప్రవీణ్, నాయకులు సిలివెరు శేఖర్, తెరటుపల్లి హనుమంతు, రంగ వెంకన్న, వెలుపల్లి వెంకటేశ్వర్లు, షీలా సత్యనారాయణ, బొక్క పురుషోత్తం రెడ్డి,కాకులారపు బొర్రా రెడ్డి, ఏళ్ల సత్య నారాయణ రెడ్డి వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page