SAKSHITHA NEWS

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఒక వరమని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 136 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు.
పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ పథకం నిలిచిందని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకం వెనక ఓ మానవీయ కోణం దాగి ఉందన్నారు.


అన్ని వర్గాల ప్రజల ముఖంలో ఆనందం చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.
గత ప్రభుత్వాలు ఏనాడు పేదింటి ఆడబిడ్డల వివాహానికి డబ్బులు సహాయం చేయలేదన్నారు. మహిళా సాధికారత మహిళల సంక్షేమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని
తెలంగాణ సర్కారుకు ఎల్లప్పుడూ అందరి దీవెనలు ఉండాలని అండగా నిలవాలి అన్నారు. పేదల సంతోషమే కేసీఆర్ లక్ష్యం అందరూ ఆత్మాభిమానంతో బ్రతకాలన్నదే వారి ఆకాంక్ష అని
అన్నారు. కళ్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్,రైతు బంధు, రైతు భీమా,దళిత బంధు,సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి పథకాలు ప్రవేశపెట్టి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
అన్ని వర్గాల ప్రజలు సగౌరవంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని,
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాద ధనలక్ష్మి నగేష్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మురారి శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్ కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీలు వివిధ హోదాలలో ఉన్న నాయకులు అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 05 11 at 3.28.25 PM

SAKSHITHA NEWS