నిరుపేదల సంక్షేమమే ముఖ్యమంత్రికి కేసీఆర్ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి
బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి – ఎంపీ బడుగుల
పార్టీ కోసం సంఘటితంగా కృషి చేయాలి – ఎమ్మెల్యే చిరుమర్తి
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,
: చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఆరెగూడెం, బోయగుబ్బ, బొంగోనిచెర్వు, పిట్టంపల్లి, ఏపూరు, పేరేపల్లి, సుంకెనపల్లి గ్రామాల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాన్ని బిఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఆవుల ఐలయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడికెళ్లినా బిఆర్ఎస్ పార్టీకి ప్రాముఖ్యత ఏర్పడిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కలిసి పనిచేయడానికి నాయకులు ప్రజలు అందరు మద్దతు తెలుపుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో 60లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని పార్టీ కుటుంబ సభ్యులని అందరినీ కలుపుకొని ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై చర్చించడమే ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశ్యమని అన్నారు. 75 స్వాతంత్ర్య దేశంలో ఏ పార్టీ చేయని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పేద, నిరుపేద ప్రజల జీవితాలను మార్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రైతుబందు, రైతుభీమ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దలితబందు, పెన్షన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం బిఆర్ ఎస్ ప్రభుత్వం అని అన్నారు. కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం అని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తూ సిబిఐ, ఈడి లతో దాడులు చేయిస్తూ బిఆర్ఎస్ బదనాం చేద్దామని చూస్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ గత పాలకుల కంటే బిఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో దేశంలోని మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. పార్టీల కతీతంగా నియోజకవర్గంలో అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు.
ప్రభుత్వం మీద గానీ స్థానిక నాయకత్వం పైన విమర్శలు చేస్తే ఖండించాలని నాయకులకు సూచించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీ లు కనుమరుగవుతాయని కావున మనందరం సంఘటింతంగా కృషి చేస్తూ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసుకుంటూ పోవాలని అన్నారు. నా సొంతకోసం, స్వార్దం కోసం ఏనాడు పనిచేయలేదని అన్నారు. పార్టీ నియమావళికి కట్టుబడి ఉన్నానని అన్నారు.
గ్రామాల్లో గత 4సం.లలో పార్టీ ఆదేశానుసారం పథకాలను అందరికీ అందేలా చేశామన్నారు. కష్టపడి పనిచేసేవారికి ఖచ్చితంగా గుర్తింపు వస్తుందని అన్నారు.
బిజెపి పార్టీ చేస్తున్న విషప్రచారం చేస్తున్నదని అలాంటి వాటిని తిప్పికొట్టాలని ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా దేవి రెడ్డి సుధాకర్ రెడ్డి ని ఎన్నిక చేశారు.
ఈ కార్యక్రమంలో
ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, జెడ్పీటీసీ సుంకరి దనమ్మ యాదగిరి, మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆవుల ఐలయ్య, కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, మండల పార్టీ మహిళా విభాగం అధ్యక్షుల చేరకుపల్లి శశిరేక మహేష్, బిక్షపతి, చిట్యాల పి ఎ సిఎస్ వైస్ చైర్మన్ మెండే సైదులు,వేలిమినేడు పిఏసీఎస్ చైర్మన్ రుద్రారపు, సర్పంచ్ లు రత్నం పుష్ప నరసింహ, వీసం బాబు, మర్రి జలంధర్ రెడ్డి, ఎంపిటిసి లు దేవరపల్లి సత్తిరెడ్డి, ఉప్పరబోయిన అంజమ్మ స్వామి, కో ఆప్షన్ సభ్యులు మోసిన్, ఉపసర్పంచ్ లు బాతరాజు రవీందర్, మహంకాళి మచ్చెందర్,
అనగంటి కిరణ్, నాయకులు కొలను సతీష్ గౌడ్,బోయపల్లి శ్రీనివాస్, పాలెం మల్లేష్,
జనగాం నరసింహ, అరూరీ నర్సింహ,ఆరూరి శ్రీశైలం, పిశాటి భీష్మా రెడ్డి, యకారీ నరేందర్, మండల యువజన విభాగం అధ్యక్షుడు తుమ్మల నాగరాజు రెడ్డి, నమ్ముల వినయ్ కుమార్, మెట్టు మనోహర్, వివిధ హోదాలలో ఉన్న నాయకులు వివిధ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు