SAKSHITHA NEWS

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్ – ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి)

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని మజీద్ లో నిర్వహించిన దావత్- ఏ- ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డితో కలిసి హాజరై ముస్లిం సోదరులతో కలసి విందును ఆరగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.


SAKSHITHA NEWS