బడ్జెట్ సొమ్మంతా పేదలకే అందిస్తున్న జగనన్నని ఆదరించండి – ఎమ్మెల్యే భూమన
జగనన్న సురక్షతో 11 రకాల ఉచిత సర్టిఫికెట్లు జారీ – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్
సాక్షితతిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత దాదాపు పేదవాళ్ళకే పంచుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా ఆదరించి మరింత తోడ్పాటును అందించాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో1 డివిజన్ తిరుమల రెడ్డి నగర్లో, 10,11 డివిజన్లకి తుడా మైధానంలో, 24వ డివిజన్ కు క్యాంపస్ స్కూల్, 39వ డివిజన్ కి చెన్నారెడ్డి కాలనీలలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, తిరుపతి అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ పేదోళ్ల కళ్ళల్లో ఆనందం కనపడాలని, పేదోళ్లు మూడు పూటలా సంతోషంగా అన్నం తినాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు, ప్రజా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు మేళ్ళు చేయాలనే తలంపుతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రజా పథకాల ద్వారా 3 లక్షలా 30 వేలా కోట్లను అందించడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరిన్ని పథకాల ద్వారా పేద ప్రజలకి ఉపయోగపడే పథకాలను అమలు పరుస్తారన్నారు. జగనన్న సురక్ష ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో, ఏ ఒక్క పేదవారు కూడా అర్హత ఉండి సర్టిఫికెట్లు లేకపోవడంతో పథకాలకు దూరంగా ఉండకూడదనే ఈ జగనన్న సురక్ష తీసుకురావడం జరిగిందన్నారు. రానున్న కాలంలో జగన్ మోహన్ రెడ్డికి మరింత తోడ్పాటు అందిస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు తమ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి హామీలన్నిటిని ఇప్పటివరకు 98% పైగా నెరవేర్చడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి చూశారని, వారిలో కులాలను గాని మతాలను గాని పార్టీలను గాని చూడకుండా కేవలం సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలుగానే గుర్తించి వారికి కావలసినటువంటి సంక్షేమ పథకాలను నిరంతరం, నిలపకుండా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా దేశంలోనే జగన్మోహన్ రెడ్డి నిలిచాడని మేయర్ డాక్టర్ శిరీష స్పష్టం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు సంబంధించిన సర్టిఫికెట్లు జననం, మరణం, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, కులము, ఆదాయము ఇలా 11 రకాల సర్టిఫికెట్లు అవసరం ఉన్నవారికి ఉచితంగా అందించేందుకే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు. దాదాపు ఇప్పటి వరకు ప్రతి డివిజన్లో వందలాది సర్టిఫికెట్లను ఉచితంగా అందించడం జరిగిందని, జగనన్న సురక్ష కార్యక్రమమును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోని, మీకు అవసరమైన సర్టిఫికెట్లను పొందాలని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. అనంతరం లబ్ధిదారులకి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోకం అనీల్ కుమార్, ఆధం రాధాకృష్ణా రెడ్డి, దొడ్డారెడ్డి ప్రవళ్ళిక రెడ్డి, హనుమంత నాయక్, బొగ్గుల పుణిత, ఇతర కార్పొరేటర్లు తిరుపతి మునిరామిరెడ్డి, జేసిఎస్ కన్వీనర్లు ఉదయగిరి రమేష్, బాలిశెట్టి కిశోర్, అదనపు కమీషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, బొగ్గుల వెంకటేష్, అడ్వకేట్ ఐ.సి.ఎస్. రెడ్డి, గంగులమ్మ, నారాయణ రెడ్డి, గౌరీ, సునీల్, సాయి, తలారి రాజేంద్ర, పాముల రమేష్ రెడ్డి, వెంకటేష్ రాయల్, మార్కెట్ గురవారెడ్డి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.