సాక్షిత : మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే భూమన, టిటిడి జేఇఓ వీరబ్రహ్మం, ఎస్వీ విసి రాజారెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి
తిరుపతి నగరంలో ప్రారంభించిన మాస్టర్ ప్లాన్ రోడ్లు, తీసుకురాభోతున్న మరిన్ని రహదారులతో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో రహదారుల విప్లవం మొదలైందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో నిర్మించబోవు మాస్టర్ ప్లాన్ రోడ్లను సోమవారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, టిటిడి జేఇఓ వీరబ్రహ్మం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ రాజారెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, అధికారులు చెన్నారెడ్డి కాలనీ నుండి ఇస్కాన్ రోడ్డును కలిపే రహదారిని, ఎస్వీ యూనివర్సిటీ నుండి అలిపిరి వైపు వచ్చే రహదారులను, జబ్బార్ లే అవుట్ నుండి శ్రీదేవి కాంప్లెక్స్ వెనుక వచ్చే రహదారిని, శ్రీనివాసం వెనుక నుండి వై.ఎస్.ఆర్ మార్గ్ వైపు వచ్చే రహదారిని, సబ్ వేలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున ప్రజలకి ఉపయోగపడే రహదారుల నిర్మాణాన్ని తిరుపతి మునిసిపల్ కార్పోరేషన్ చాలా భాధ్యతతో, ప్రతిష్టాత్మకంగా తీసుకుని రోడ్లను వెడల్పు చేస్తే తప్ప ప్రజలకి సౌకర్యవంతంగా వుండదనే ఆలోచనతో 17 మాస్టర్ ప్లాన్ రోడ్లను, నగరంలో అంతర్గత రహదారులను, అలాగే ప్రీ లెప్టులను ఇలా అనేక రూపాలలో తీసుకురావాలనే తలంపుతో, ఒకవైపున టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మరోవైపున ఎస్వీ యూనివర్సిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అనేక రూపాలుగా ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ఒకే దారికి తెచ్చి, అందరి సమన్వయంతో ఈ రహదారుల నిర్మాణం జరపాలని నిశ్చయంతో, మొత్తం అందరం కూడా యుద్ధ ప్రాతిపదిక మీద అధికారులందరూ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే భూమన తెలిపారు. తిరుపతిని ఒక గొప్ప వేదికగా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే ఒక రీసెర్చ్ చేయడానికి, రోడ్లను ఎలా ఆధునికరించడానికి తిరుపతి ఒక బ్రాండ్ గా తీసుకొని వచ్చే రోజు తొందరలోనే వస్తుందన్నారు. తిరుపతిలోని రహదారులకు, రోడ్లకు వెంకటేశ్వర స్వామికి సేవ చేసినటువంటి పుణ్యమూర్తులు, మహాత్ములు, దాసులు, చక్రవర్తులు, అర్చకులు, ఆళ్వారుల పేర్లను పెట్టడం జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. టిటిడి జేఇఓ వీరబ్రహ్మం, ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్లు మాట్లాడుతూ రహదారుల నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ఎస్వీ యూనివర్సిటీ మొదటి గేటు మీదుగా అలిపిరి వైపు ఒక ప్రధానమైన రహదారిని తీసుకురావడం జరుగుతుందని, దీని వలన నగర ప్రజలకే కాకుండా, స్విమ్స్, రుయా, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రులకు వచ్చే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. అదేవిధంగా వివిఐపిలు నగరంలోకి రాకుండా అలిపిరి మార్గంలోకి తీసుకెళ్లేందుకు ఎస్వీ యూనివర్సిటీ నుండి ఎన్.సి.సి నగర్ వైపుగా అలిపిరి కలుపుతూ మరో ప్రధాన రహదారిని తీసుకురావడం జరుగుతుందన్నారు. శ్రీనివాసం వెనుకవైపు ఒక రహదారిని తీసుకురావడం, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ వైపు నుండి శ్రీనివాసం, మాధవంలకు వెళ్ళె యాత్రికుల కోసం సబ్ వేని మరింత విస్తరించి యాత్రికులకు పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరం చాలా ఇరుకైన రోడ్లతో ఉండడం, నగరం విస్తరించకపోవడానికి ప్రధాన కారణం సరియైన రహదారులు లేకపోవడమే అని గుర్తించడంతో తిరుపతి నగరంలో అంతర్గత రోడ్లను ఆధునికరించడంతోపాటు నగరం చుట్టూ నగర పరిధిలో వచ్చే మాస్టర్ ప్లాన్ రహదారులను తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రారంభించిన మాస్టర్ ప్లాన్ రహదారులు ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారినాయని, త్వరలో రాబోవు రోడ్లతో తిరుపతి మరింత అభివృద్ధి వైపుకి వెలుతుందని అభినయ్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో టిటిడి చీప్ ఇంజనీర్ నాగేశ్వరరావు, మునిసిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, బొగ్గుల పుణిత, పుల్లూరు అమర్నాధ్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యం, డిఈ గోమతి, సర్వేయర్ దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.