SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 08 at 4.49.45 PM

తిరుపతిలో ఘనంగా వై.ఎస్.ఆర్ జయంతి కార్యక్రమం


సాక్షితతిరుపతి : దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ఆయన కుమారుడు వై.ఎస్.జగన్‌ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ శ్రేణుల సమక్షంలో నెహ్రూనగర్ లోని పడమటి వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద వై.యస్.ఆర్ చిత్రపటానికి నివాళులర్పించి, కేక్ కటింగ్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని, బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోందని, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని కొనియాడారు. 2024లో మళ్ళీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ఆదరించి, ఆశీర్వదించడానికి సిద్ధంగా వున్నారని భూమన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, నరసింహాచారి, తమ్ముడు గణేష్, టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంధ్ర రెడ్డి, గంగమ్మగుడి చైర్మెన్ కట్టా గోఫియాదవ్, మైనార్టి స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇమ్రాన్, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, కల్పన యాదవ్, సి.కె.రేవతి, బసవ గీత, నరేంధ్రనాధ్, అమర్నాధ్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కోటూరు ఆంజినేయులు, అనీష్ రాయల్, తిరుత్తణి శైలజ, పుణిత, మునిసిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు వెంకట రెడ్డి, ఇమామ్ సాహేబ్, రుద్రరాజు శ్రీధేవి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు జ్యోతిప్రకాష్, మబ్బు నాధముని రెడ్డి, అమరనాధ్ రెడ్డి, నాగిరెడ్డి, వెంకటేష్ రాయల్, గ్రంధలయ చైర్మెన్ మధుబాల, నాయకులు వెంకటమునిరెడ్డి, తొండమనాటి వెంకటేష్ రెడ్డి, మునిరామిరెడ్డి, తలారి రాజేంధ్ర, బాలిశెట్టి కిశోర్, చింతా రమేష్ యాదవ్, నల్లాని బాబు, స్టోర్ నాధముని, గీతా, పుణిత, యువజన విభాగం నాయకులు, అనుబంధ విభాగల నాయకులు, వార్డు అధ్యక్షులు, కన్వినర్లు, గృహసారదులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.


SAKSHITHA NEWS