SAKSHITHA NEWS

గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి)

గుర్రంపోడు మండలం లోని కొప్పోల్, బొల్లారం గ్రామాలలో కూలిపోయిన ఇండ్లను
అధికారులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి భరోసా కల్పిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ
కొప్పోల్ మరియు బొల్లారం గ్రామాలలో వడగండ్ల వానతో నష్టపోయిన 3600 ఎకరాల వరి మరియు పండ్ల తోటలను పరిశీలించి అధికారులు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వీటితో పాటు వడగళ్ల వానతో కూలిపోయిన ఇండ్లు, జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం ఇవ్వడానికి అనుగుణంగా ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇండ్లు కూలీ గాయపడ్డ బాధితులను పరామర్శించారు.


ఈ కార్యక్రమం లో ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ, పిఎసిఎస్ ఛైర్మన్ ఆవుల వెంకన్న, కొప్పొల్ సర్పంచ్ తిరుగుడు లింగారెడ్డి, అధికారులు ఎంపీడీవో శ్రీపాద సుధాకర్,ఎలక్ట్రిషన్ ఏఈ,ఆర్ఐలు,వెటర్నరీ అధికారులు,మండల ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు, ఉపాధ్యక్షుడు వెలుగు రవి, అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్ కుమార్,ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు దోటి చంద్రమౌళి, ఎంపీటీసీ పురం వేణు హేమలత,సర్పంచ్ లు చాడ చక్రవర్తి, కామాల్ల నర్సింహ, కేశని యాదగిరి రెడ్డి, పోలె రామచంద్రం, మర్రి సైదులు, సల్వజీ నగేష్ వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS