SAKSHITHA NEWS

వైల్డ్ లైఫ్ ఫోటో ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
రాజమహేంద్రవరం రూరల్, సాక్షిత :
రాజమండ్రి గోదావరి మల్లిగా సత్రంలో గోదావరి వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైల్డ్ లైఫ్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. ఎగ్జిబిషన్లో ఫోటోలు ఆసక్తిగా తిలకించి ఫోటో తీసిన వారిని అభినందించారు. అనంతరం గోదావరి వైల్డ్ లైఫ్ సొసైటీ వాళ్ళు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ని సత్కరించి చిత్రపటం బహుమతిగా అందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 19 at 18.10.31

SAKSHITHA NEWS