SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రిశ్రీమతి సత్యవతి రాథోడ్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.


*సాక్షిత : * పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి
జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మంత్రి గారు ప్రశంసాపత్రాలు అందజేశారు
అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ ను సందర్శించారు.
అలరించిన విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు.
*తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రసంగం..

తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకొని స్వయం పాలనతో తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన, రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వేడుకలకు విచ్చేసిన మహబూబాబాద్ జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, , అమరవీరుల కుటుంబ సభ్యులకు, విద్యార్థినీ, విద్యార్థులకు, స్వాతంత్ర్య సమరయోధులకు , పాత్రికేయ మిత్రులకు తెలంగాణ దశాబ్ధి ఉత్సవ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అనేక ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షనెరవేరి, తెలంగాణ అస్తిత్వ పతాకం ఆకాశమంత ఎత్తుకు ఎగిరి అవనిపై పూలజల్లుకురిపించింది. నాటి ఉద్యమ సారధిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి ఉద్యమ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని పునరంకితం కావడమే ఇప్పటి సందర్భం. సాధించుకొన్న తెలంగాణారాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ముందుకుసాగుతున్న విషయం మీకు తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ తొమ్మిది వసంతాలలో వేసిన అడుగులు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు సామాన్యమైనవి కావు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
అందులో కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, రైతు బందు, ఆసర పెన్షన్ ల ద్వారా అర్థిక చేయూత, ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల బియ్యం, డబుల్ బెడ్రూం ఇండ్లు, విద్యార్థులకు సన్నబియ్యం, కొత్తగా 510 రెసిడెన్సియల్ స్కూల్స్, ఎస్సి, ఎస్టీ లకు ప్రత్యేక ప్రగతి నిధిలాంటి కార్యక్రమాలెన్నో అమలు చేస్తున్నాం. అలాగే రాష్ట్రోంలో ఎన్నో పరిపాలన సంస్కరణలు తేవడంతో పాటు, చిరుద్యోగులైన పెదరిక నిర్ములన సంస్ధ (సెర్ప్), ఐకేపీ సంస్థలలో పనిచేస్తున్న వారికి పేస్కేల్ వర్తింపజేయడం, జూనియర్ పంచాయితీ కార్యదర్శుల, వీ ఆర్ ఏల సర్వీస్ లను క్రమబద్ధీకరించడం వంటి నిర్ణయాల ద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధీతో పాటు సంక్షేమానికి చిరునామాగా మారింది


పరిపాలన కేంద్రికరణలో భాగంగా మహబూబాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ఎర్పాటు చేసుకున్నాము. జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఇటివలే ముఖ్యమంత్రి కేసిఆర్ సువర్ణ హస్తలతో ప్రారంబించుకున్న తరువాత మొదటి సారిగా ఈ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ వేడుకలలో పాల్గోనడం నా అదృష్టంగా బావిస్తున్నాను. మహబూబాబాద్ ను జిల్లాగా ఎర్పాటు చేయడంతో పాటు, జిల్లా సమగ్ర అబివృద్ధికి వేల కోట్ల రూపాయాల నిధులను మంజూరుచేసిన మన ముఖ్యమంత్రి కి జిల్లా ప్రజలందరి తరుపున హృదయ పూర్వక దన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శుభ సమయాన జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలను మీ ముందుంచుతున్నాను.
పోడు(అటవీ హక్కు పత్రములు) భూములు:
అడవులనే నమ్ముకుని జీవిస్తున్న అదివాసుల జీవన సంస్కృతులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుంది. అందులో బాగంగానే గిరిజన రైతుల కలను సాకారం చేస్తూ ఈ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 24వ తేది నుండి 30వ తేదివరకు గిరిజనులకు పోడు పట్టాలను అందించబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 845 గ్రామాలు, తండాలు, గుడాల పరిధిలోని ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ఉన్న 4 లక్షల ఒక వెయ్యి 405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేస్తున్నాము.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలోని అటవీ భూమి సాగుచేస్తున్న తొమ్మిది మండలాలలో 152 గ్రామ పంచాయతీలలోని 320 ఆవాసాలలోని రైతులను గుర్తించడం జరిగింది. 24వేల 181 దరఖస్తూలు పరిష్కరించి 67వేల 730 ఎకరాలకు పట్టాలను అందజేయనున్నాం. వీరందరికి వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి రైతు బంధు పథకం క్రింద ఆర్ధిక సహాయం అందించేందుకుగాను బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఎర్పాట్లు చేస్తున్నాము.


SAKSHITHA NEWS