SAKSHITHA NEWS
Minister Satyavati Rathore visited MLA Redya Naik

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్.


సాక్షిత : ఇటీవల మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ గాయత్రి హిల్స్ లోని వారి నివాసానికి చేరుకున్న డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యా నాయక్ ని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వారిని కలిసి పరామర్శించారు. రెడ్యానాయక్ ఆరోగ్య వివరాల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి.. ఎలాంటి ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి సత్యవతి రాథోడ్


……………
మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ఎంపీ మాలోత్ కవిత, నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు శ్రీరంగారెడ్డి తదితరులు ఉన్నారు.