ప్రభుత్వ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర మంత్రి
** కూడా పాల్గొన్న “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జీవకోన 46, 47 వార్డుల్లో ప్రభుత్వ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో తిరుపతి జిల్లా ఇంచార్జి మంత్రి అండ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా రేణిగుంట విమానాశ్రయం నుంచి జీవకోన చేరుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ స్థానిక కూటమి నాయకులతో కలిసి వార్డులో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, కూటమి నాయకులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు అధికారులు, కూటమి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
