స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు కలెక్టర్ సర్టిఫికెట్
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: చిత్తూరు పోక్సో కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న న్యాయవాది వి.మోహనకుమారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నుంచి ఉత్తమ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈమేరకు భారత గణతంత్ర వేడుకల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సమక్షంలో కలెక్టర్ నుంచి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కు చెందిన వారికి ఇచ్చే ఉత్తమ సర్టిఫికెట్ ను మోహనకుమారి అందుకున్నారు. ఆమెకు ఉత్తమ అవార్డు రావడం పట్ల టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్, పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
