భారత క్రికెట్ జట్టు ఘన విజయం
** తిరుపతిలో బీజేపీ నాయకుల సంబరాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టి-20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తిరుపతిలో బీజేపీ నాయకులు, క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సెమీఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 253 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి పరాజయం పాలైంది. దీంతో భారత్ విజయం సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని తిరుపతిలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు.
భారత జాతీయ జెండాలు చేత పట్టుకుని “భారత్ మాతాకీ జై” నినాదాలు చేస్తూ ప్రజలకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై కూడా భారత్ విజయం సాధించి టి20 ప్రపంచ కప్‌ను సగౌరవంగా అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గుండాల గోపీనాథ్, లోక ప్రభాకర్ నాయుడు, పాటిబండ మురళి, జయంత్ కుమార్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవన్ మస్తాన్, తెలుగుదేశం నాయకులు చిత్రపు హనుమంతరావు, సింగంశెట్టి సుబ్బరామయ్య, కళాకారులు కన్నప్ప కేశవరెడ్డి, జయరామ్ యాదవ్, చంద్రబాబు నాయుడు, సురేష్ క్రికెట్ అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
