ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం
** పాల్గొన్న “రాయలసీమ రంగస్థలి” సభ్యులు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తమ అభిమాన గాయకున్ని స్మరించుకుంటూ “రాయలసీమ రంగస్థలి” చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ప్రతి నెల 1వ తారీఖున ఆయన విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలతో నివాళి అర్పిస్తున్నారు. తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఆయనను స్మరించుకుంటూ స్థానిక వివి మహల్ రోడ్ చివరిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల ఒకటో తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు.
అందులో భాగంగా తుఫానును సైతం లెక్కచేయకుండా జోరు వానలోనూ రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఘంటసాల అభిమాని లోకా ప్రభాకర్ నాయుడుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఘంటసాల అభిమానులు సోము ఉమాపతి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, వినాయక రెడ్డి, జనార్దన్ రెడ్డి, తులసి రామ్ నాయుడు, కరుణాకర్, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
