జోరు వర్షాన్ని సైతం లెక్కచేయని తెలుగు తమ్ముళ్లు
ఎమ్మెల్యే కురుగొండ్ల ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
(సాక్షిత) నెల్లూరు బ్యూరో రాపూర్
రాపూరు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని నిరూపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు రాపూరు మండలంలోని చెర్లోపల్లి నందు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాపూరు మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, మంచానికి పరిమితమైన వికలాంగులకు రూ.15వేలు అందిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల కళ్ళల ఆనందం చూస్తే సంతోషంగా ఉందని తెలియజేశారు.. అదేవిధంగా ప్రతి పంచాయతీలో టిడిపి నాయకులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు . దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నల్ల వడ్ల వెంకట రమణారెడ్డి, మొహరం రెడ్డి మధు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కూటమి నాయకులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
